నేనెందుకు బంద్ లో పాల్గొనాలి?
సెప్టెంబర్ 27న విద్యాసంస్థల బంద్ ఎందుకు?? దేశంలో బిజెపి ప్రభుత్వం, తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి కొద్ది కాలంలోనే విద్యారంగంలో అసమానతలు తారా స్థాయికి చేరాయి.నమో ప్రభుత్వం విదేశీ కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యా సంస్థలను ఆహ్వానిస్తూ,వారికి హారతులు పడుతూ,ప్రభుత్వ విద్యా సంస్థలను సర్వ నాశనం చేసే కుట్ర చేస్తోంది.నాణ్యమైన ఉన్నత విద్య పేరుతో విదేశీ, స్వదేశీ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు.వచ్చిన ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు,ఫీజు రీయింబర్స్ మెంట్ ఉండదని తేల్చి చెప్పారు,ఇష్టారీతిన పనికిరాని కోర్సులను పరిచయం చేస్తున్నారు.ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా వాటిని చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.విదేశీ కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగమనంతో ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడుతున్నాయి,పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.పేద విద్యార్థులు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుకునే స్తోమత లేదు,అక్కడ రిజర్వేషన్లు,ఫీజు రీయింబర్స్ మెంట్,నచ్చిన కోర్సులు అవేవీ ఉండవు.పుండు మీద రోకలి పోటు అన్న చందంగా ఇదే తరుణంలో బిజెపి ప్రభుత్వం...