నేనెందుకు బంద్ లో పాల్గొనాలి?

 సెప్టెంబర్ 27న విద్యాసంస్థల బంద్ ఎందుకు??


దేశంలో  బిజెపి ప్రభుత్వం, తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి కొద్ది కాలంలోనే విద్యారంగంలో అసమానతలు తారా స్థాయికి చేరాయి.నమో ప్రభుత్వం విదేశీ కార్పొరేట్ ,ప్రైవేట్ విద్యా సంస్థలను ఆహ్వానిస్తూ,వారికి హారతులు పడుతూ,ప్రభుత్వ విద్యా సంస్థలను సర్వ నాశనం చేసే కుట్ర చేస్తోంది.నాణ్యమైన ఉన్నత విద్య పేరుతో విదేశీ, స్వదేశీ ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారు.వచ్చిన ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు,ఫీజు రీయింబర్స్ మెంట్ ఉండదని తేల్చి చెప్పారు,ఇష్టారీతిన పనికిరాని కోర్సులను పరిచయం చేస్తున్నారు.ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా వాటిని చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.విదేశీ కార్పోరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగమనంతో ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడుతున్నాయి,పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.పేద విద్యార్థులు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థలలో చదువుకునే స్తోమత లేదు,అక్కడ రిజర్వేషన్లు,ఫీజు రీయింబర్స్ మెంట్,నచ్చిన కోర్సులు అవేవీ ఉండవు.పుండు మీద రోకలి పోటు అన్న చందంగా ఇదే తరుణంలో బిజెపి ప్రభుత్వం విద్యా రంగంలో అనేక పనికిమాలిన సంస్కరణలతో 2020 సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని పరిచయం చేసింది.ఒక కొత్త రంగుల ప్రపంచాన్ని చూపించిన ఈ విద్యా విధానం దానిని అమలు చేయడానికి కావలసిన నిధుల గురించి ఆ ముసాయిదాలో ఎక్కడా మాట్లాడలేదు.

ఎందుకు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించాలి??

•ప్రైవేటైజేషన్,కార్పోరేటైజేషన్,సెంట్రలైజేషన్ ను నూతన విద్యా విధానం ప్రోత్సహిస్తుంది.

• అన్ని రకాల జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించేందుకు తీసుకొచ్చిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి అధికార కేంద్రీకృత సంస్థల స్వయంప్రతిపత్తి ప్రశ్నార్థకం కానుంది.

•అన్ని రకాల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆంగ్ల బోధన చేయడానికి సరిపడా స్కిల్డ్ టీచర్లు లేరు, కావున భాషా సమస్య తలెత్తే అవకాశం ఉంది.

UGC,AICTE స్థానంలో ఉన్నత విద్యా కమిషన్ ను తీసుకురావడం అంటే పరిశోధనా రంగానికి నిధుల కోత విధించడమే.ఉన్నత విద్యా కమిషన్ లో రాజకీయ నాయకుల జోక్యంతో పరిశోధనా రంగంలో నిధుల దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

• నూతన విద్యా విధానం 20 20 అమలు చేయాలంటే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుంది.కానీ ఈ నిధులను గూర్చి డ్రాఫ్ట్ కమిటీ ఎక్కడా మాట్లాడలేదు.

•ఎం.ఫిల్ వంటి కోర్సులను రద్దు చేయాలని ఈ ముసాయిదాలో ఉంది

•సాధారణ డిగ్రీ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలకు పెంచింది, తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు మధ్యలోనే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉంది

ఇటువంటి అనేక అనాలోచిత సంస్కరణల వల్ల విద్యార్ధి లోకం నష్టపోయే ప్రమాదం ఉంది.దీంతో పాటు బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల సిలబస్ లో కూడా అనేక మతపరమైన అంశాలను జోడించాలని ప్రయత్నిస్తోంది.విద్యాసంస్థల్లో హిందూత్వ భావజాల వ్యాప్తికై కృషి చేస్తోంది.తమ భావజాల వ్యాప్తిలో అడ్డంకిగా నిలిచిన వారిపై రాజద్రోహం కేసులు పెడతుంది, వారిని చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. రోహిత్ వేముల మరణం, జేఎన్యూలో దాడులు, కన్నయ్య కుమార్ పై ద్రోహం ఈ తరహాలో జరిగినవే.కావున విద్యార్థి మిత్రులారా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ విదేశీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టే దానికై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తో కలిసి రండి, శాస్త్రీయ విద్యా విధానానికై పాటుపడండి. సెప్టెంబర్ 27న జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సెగ తగిలేలా పిడికిలి బిగించండి.

భారత్ బంద్ డిమాండ్స్

1) ప్రైవేటైజేషన్,కార్పోరేటైజేషన్,సెంట్రలైజేషన్ ను ప్రోత్సహిస్తున్న నూతన విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి.

2) విదేశీ కార్పోరేట్,ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.

3) దేశ వ్యాప్తంగా అసమానతల్లేకుండా 18 సంవత్సరాలు నిండిన అన్ని వర్గాల విద్యార్థులకు,ఉపాధ్యాయులకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలి,త్వరగా పూర్తి చేయాలి.

4) కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధులు పెంచాలి,

5) విద్యా సంస్థల్లో అశాస్త్రీయ హిందూత్వ భావాజాల వ్యాప్తికై  విద్యార్థులపై దాడులను ఆపాలి.

6) ప్రభత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలి.వాటి స్వయం ప్రతిపత్తిని కాపాడాలి.   

(జెఎన్యూలో ఎస్.ఎఫ్.ఐ నాయకురాలి ఫైల్ ఫోటో)
 


(రోహిత్ వేముల ఫైల్ ఫోటో)
                            

విప్లవ అభినందనలతో

బి వీరభద్రం

(ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా


Comments